తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ ఏడాది చివరి ఆరు నెలలు ఆశాజనకమే ! - Japan

ప్రస్తుతం క్షీణిస్తోన్న ప్రపంచ వృద్ధి ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో పుంజుకోనుందని  జీ20 దేశాల ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఈ మేరకు వాషింగ్టన్​లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సమావేశంలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

2019 చివరి 6 నెలలు ఆశాజనకమే!

By

Published : Apr 13, 2019, 6:33 PM IST

కొంత కాలంగా పడిపోతున్న ప్రపంచ వృద్ధి ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో మళ్లీ పుంజుకోనుందని జీ20 దేశాల ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం, అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నందున ఇది సాధ్యమౌతుందని అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్​), ప్రపంచ బ్యాంకు వసంత కాల సమావేశం వాషింగ్టన్​లో జరిగింది. దీనికి వివిధ దేశాల ఆర్థిక ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా ప్రపంచ వృద్ధి నెమ్మదించినట్లు అంగీకరించారు. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ వృద్ధికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జీ20 దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. జీ20 దేశాలకు ప్రస్తుతం జపాన్​ అధ్యక్షత వహిస్తోంది. ఇటీవల ప్రపంచ వృద్ధిని తగ్గిస్తూ ఐఎంఎఫ్​ అంచనాలు విడుదల చేసింది. ఈ గణాంకాలు నిజమయ్యే ఆస్కారం ఎక్కువగా ఉందని జీ20 దేశాల అధికారులు ఆశిస్తున్నట్లు.. జపాన్​ కేంద్ర బ్యాంకు సారథి తెలిపారు. అదే సమయంలో ప్రతీ దేశం తనవంతు ప్రయత్నం చేయాలని సూచించారు.

తగ్గిన వృద్ధి

ఇటీవల 2019కి సంబంధించి ప్రపంచ వృద్ధిని 3.6 శాతం నుంచి 3.3 శాతానికి సవరించింది ఐఎంఎఫ్​. ఆర్థిక మాంద్యం సంభవించిన 2009 అనంతరం ఇదే అత్యల్పం. కానీ 2020లో వృద్ధి మళ్లీ 3.6 శాతానికి ఎగబాకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ సంస్థ.

ABOUT THE AUTHOR

...view details