2021-22లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం గడించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇందుకోసం రెండు బ్యాంకులు, ఓ బీమా సంస్థ సహా వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రైవేటీకరించనున్న కంపెనీలివే..
ఐడీబీఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సహా పలు ఇతర కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణను 2021-22లో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.