ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు క్షీణత 7.4 శాతంగా నమోదవ్వొచ్చని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు విడుదల చేసిన నివేదికలో.. 2020-21లో భారత వృద్ధి రేటు -10.9 శాతం ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేయడం గమనార్హం.
ఊహించినదానికన్నా మెరుగ్గా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి రేటు క్షీణత అంచనాలను ఎగువకు సవరించినట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఈ సానుకూలతల ఆధారంగా 2021-22లో భారత్ ఏకంగా 11 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.