దేశంలో ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను ఆదా పెట్టుబడులు సహా, ఆలస్యంగా ఆదాయపన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు ఇదే చివరి తేది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది కేంద్రం. గడువు ముగిసేందుకు ఇంకా 9 రోజులే ఉంది. ఈ లోపు పూర్తి చేయాల్సిన 4 తప్పనిసరి పనులు.. వాటి వివరాలు మీ కోసం.
పన్ను ఆదా పెట్టుబడి
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమర్పించేందుకు జూన్ 30 చివరి తేదీ. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ పన్నుల ఫారంలో కొత్త టేబుల్‌ను జత చేసింది. ఇందులో ఏప్రిల్, జూన్‌లో 2019-20కి సంబంధించి పెట్టిన పెట్టుబడుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఆలస్య ఐటీఆర్ (2018-19)దాఖలు..
సాధారణంగా ఐటీఆర్ దాఖలుకు జులై 31 చివరి తేదీ. అయితే మదింపు సంవత్సరం ముగిసే వరకు (మార్చి 31 వరకు) రిటర్ను దాఖలు చేసే వీలుంటుంది. లాక్డౌన్ కారణంగా ఈ గడువు కూడా ఈ జూన్ 30 వరకు పెరిగింది. ఇంకా మీ రిటర్ను దాఖలు చేయకపోతే వెంటనే చేయడం మంచిది.