దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎగుమతిదారుల సంఘాలతో చర్చించి.. వారి అవసరాలను తెలుసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి' అజెండాను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఈశాన్య ప్రాంత లాజిస్టిక్ ఎగుమతుల కోసం.. రాష్ట్రాల వారీగా ప్రణాళిక రూపొందించాలని బ్యాంకులకు పిలుపునిచ్చారు.
'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి లక్ష్యంతో పని చేయాలి'
ఎగుమతులకు అవకాశమున్న వస్తువులను దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో గుర్తించాలన్న ప్రధాని ఆలోచన మేరకు.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక సూచనలు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 'ఒక జిల్లా.. ఒకే ఉత్పత్తి' అజెండాను ప్రోత్సహించేలా బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని సలహా ఇచ్చారు.
బ్యాంకుల వార్షిక సమీక్షలో నిర్మలా సీతారామన్
ముంబయిలో జరిగిన బ్యాంకుల వార్షిక సమీక్షా సమావేశంలో.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో సీతారామనన్ ఈ విషయాలపై చర్చించారు. ఇందులో దిగుమతిదారుల రుణాల కోసం ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తరచూ తిరిగే సమస్య లేకుండా సులభమైన పద్ధతులను అనుసరించాలని నిర్మల పేర్కొన్నారు. ఆర్థిక సాంకేతిక సంస్ధలకు రుణాలను అందించడం సహా వాటి సేవల నుంచి బ్యాంకులు కూడా లబ్ది పొందాలని సూచించారు.
ఇదీ చదవండి:Insurance: ప్రతివారం ఖర్చులకు డబ్బు అందించే 'బీమా' పథకం!
Last Updated : Aug 25, 2021, 4:58 PM IST