కరోనా సంక్షోభం దృష్ట్యా భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్. 2020-21లో భారత వృద్ధి రేటు 1.8శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. వైరస్ కారణంగా ఆదాయం కోల్పోతున్నందువల్ల.. ప్రైవేటు వినియోగం తగ్గే అవకాశం ఉన్నట్లు వివరించింది.
గతంలో భారత్ 4.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొనడం గమనార్హం.