వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారత జీడీపీ ఏకంగా 12.8 శాతంగా నమోదవ్వచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇంతకు ముందు అంచనాల్లో ఇది 11శాతంగా ఉండటం గమనార్హం. లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అవుతున్నట్లు ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్ (జీఈఓ)లో ఫిచ్ పేర్కొంది. కరోనా వైరస్ను మెరుగ్గా నియంత్రించడం, బలమైన క్యారీ ఓవర్ ప్రభావం, తక్కువ వడ్డీ రేట్లు అండగా నిలవడం వల్ల వృద్ధిరేటు అంచనాలను సవరిస్తున్నట్లు ఫిచ్ వెల్లడించింది.
'2020 ద్వితీయార్ధంలో భారత వృద్ధి రేటు కొవిడ్ మునుపటి స్థాయికి చేరింది. దీనితో 2021-22 వృద్ధి రేటు అంచనాలను 11 శాతం నుంచి 12.8 శాతానికి సవరించాం. అయితే కొవిడ్ మునుపటి అంచనాల కంటే భారత జీడీపీ దిగువనే ఉండొచ్చు' అని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతంగా నమోదై కొవిడ్ మునుపటి స్థాయిని అధిగమించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధిరేటు 7.3 శాతం క్షీణించింది.
సమస్యలు ఇంకా సమసిపోలేదు..