తెలంగాణ

telangana

ETV Bharat / business

జీడీపీ క్షీణత 9.4 శాతమే: ఫిచ్

దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం నుంచి వేగంగా రికవరీ అవుతున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మంగళవారం ప్రకటించింది. ఈ కారణంగా 2020-21లో భారత జీడీపీ 10.5 శాతం క్షీణిస్తుందన్న గత అంచనాలను.. -9.4 శాతానికి సవరించింది.

Fitch On India Growth rate
ఫిచ్ జీడీపీ అంచనాలు సానుకూలం

By

Published : Dec 8, 2020, 11:35 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను సానుకూలంగా సవరించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. 2020-21లో జీడీపీ 10.5 శాతం క్షీణిచొచ్చన్న గత అంచనాను.. తాజాగా -9.4కు తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను మాత్రం 11 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం విడుదల చేసిన నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది ఫిచ్. దేశంపై కరోనా తీవ్రంగా ప్రభావం చూపినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్లను సర్దుబాటు చేయడం, దీర్ఘకాలిక ప్రణాళికల్లో మరింత అప్రమత్తత అవసరమని సూచించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి రేటు -23.9 శాతంగా నమోదవ్వగా.. రెండో త్రైమాసికంలో -7.5 శాతానికి రికవరీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఫిచ్ వృద్ధి రేటు అంచనాలను సానుకూలానికి సవరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.9 శాతంగా నమోదవ్వొచ్చని పేర్కొంది ఫిచ్. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 3.5 శాతానికి దిగొస్తుందని పేర్కొంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల అంచనాలను ప్రకటించింది ఫిచ్. 2020లో ప్రపంచ వృద్ధి రేటు -3.7 శాతంగా నమోదవ్చొచ్చని తెలిపింది. సెప్టెంబర్​లో ఈ అంచనా -4.4 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:2020-21లో కోళ్ల పరిశ్రమకు లాభాలే

ABOUT THE AUTHOR

...view details