కరోనా నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాను భారీగా తగ్గించింది ఫిచ్ రేటింగ్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ జీడీపీ 0.8 శాతానికే పరిమితం కావచ్చని తాజా అంచనాల్లో వెల్లడించింది. ఇంతకు ముందు అంచనాల్లో భారత్ 4.9 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని పేర్కొనడం గమనార్హం.
కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణించినా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉన్నట్లు ఫిచ్ నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ 6.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని లెక్కగట్టింది.