భారత వృద్ధి అంచనాలను స్థిరం నుంచి ప్రతికూలానికి(నెగటివ్) మార్చింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితులు దేశ వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేయొచ్చని తాజా అంచనాల్లో వెల్లడించింది.
దీర్ఘకాలిక విదేశీ మారకపు జారీ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలంగా సవరించింది. ప్రస్తుతం రేటింగ్‌ను 'బీబీబీ -'గా ఉంచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వద్ధి రేటు 5 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌కు సానుకూలంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2021-22లో భారత్ 9.5 శాతం జీడీపీ రేటును సాధించే వీలుందని పేర్కొంది.
ఈ సారికి స్వల్ప వృద్ధే...
ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ఏడాది స్వల్ప వృద్ధిని మాత్రమే సాధిస్తాయని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. భారత వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 4 శాతం క్షీణించొచ్చని తాజా నివేదికలొ పేర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో వృద్ధిపై ప్రభావం పడనున్నట్లు తెలిపింది.
కొవిడ్ నియంత్రణకు తీసుకునే చర్యలు ఆర్థిక కార్యకలాపాలను, బాహ్య డిమాండ్‌ను తగ్గించొచ్చని పేర్కొంది.
హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, తైపీ మినహా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు ఈ ఏడాది 0.4 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించొచ్చని తెలిపింది. 2021లో ఇది 6.6 శాతానికి పెరగొచ్చని అభిప్రాయపడింది.
కరొనా కారణంగా దక్షిణాసియా.. 2020 వృద్ధి రేటు క్షీణతను ఏప్రిల్‌లో అంచనా వేసిన 4.1 శాతం నుంచి 3 శాతానికి సవరించింది ఏడీబీ. 2021 వృద్ధి రేటు అంచనాను 6 శాతం నుంచి 4.9 శాతానికి మార్చింది.
ఇదీ చూడండి:పన్నెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు