తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన ప్రభుత్వ రాబడి.. 3.6 శాతంగా ద్రవ్యలోటు! - బిజినెస్ వార్తలు తెలుగు

ప్రభుత్వ రాబడి తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో 2019-20 ద్రవ్యలోటు అంచనాను 3.6 శాతానికి పెంచింది ఫిచ్ సొల్యూషన్స్. ఇంతకు ముందు నివేదికతో పోలిస్తే ఈ సారి అంచనా 0.2 శాతం ఎక్కువ.

ద్రవ్యలోటు అంచనాను పెంచిన ఫిచ్

By

Published : Nov 6, 2019, 2:59 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యలోటు అంచనాను పెంచుతూ నివేదిక విడుదల చేసింది ఫిచ్ సొల్యూషన్స్. 2019-20 స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.6 శాతం ద్రవ్యలోటు ఉంటుందని పేర్కొంది. ఇంతకు ముందు వేసిన అంచనాల్లో ద్రవ్యలోటు 3.4 శాతంగా ఉంటుందని ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది.

ఆర్థిక మందగమనం భయాలు, కార్పొరేట్​ సుంకం తగ్గించడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వ రాబడి తగ్గడం... ద్రవ్యలోటు అంచనాలు పెంచేందుకు ప్రధాన కారణమని ఫిచ్ పేర్కొంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 3.3 శాతం ద్రవ్యలోటుకు విరుద్ధంగా ఫిచ్​ సొల్యూషన్స్ అంచనాలు ఉండటం గమనార్హం.

ద్రవ్యలోటు అంచనాలు తగ్గించడానికి కారణాలు..

వృద్ది మందగమనం భయాలతో కార్పొరేట్ సుంకాన్ని 10 శాతం మేర తగ్గిస్తూ ఉద్దీపనలు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1.45 కోట్ల మేర ఆదాయం తగ్గనున్నట్లు అంచనా. జీఎస్టీ వసూళ్లూ వరుసగా తగ్గుతూ రావడమూ.. ప్రభుత్వాదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

వీటికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభం, వృద్ధి అంచనాలు తగ్గడం వంటివీ.. ద్రవ్యలోటు పెరిగేందుకు కారణమని ఫిచ్ సొల్యూషన్ వివరించింది.

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​లో 10,000 ఉద్యోగాల కోత!

ABOUT THE AUTHOR

...view details