ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2021-22) వృద్ధిరేటు అంచనాలను గత జూన్ నాటి 10 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించింది. అంతకు ముందు 12.8 శాతం వృద్ధి లభిస్తుందనీ సంస్థ పేర్కొనడం గమనార్హం. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి ప్రభావంతో ఆర్థిక రికవరీలో వేగం తగ్గడం వల్లే వృద్ధి అంచనాలను మరోసారి తగ్గించినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) వృద్ధి రేటు అంచనాలను మాత్రం 8.5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. 2020-21లో దేశ జీడీపీ 7.3 శాతం మేర క్షీణించిన సంగతి తెలిసిందే. 2019-20లో 4 శాతం వృద్ధిరేటు నమోదైంది.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
- ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతానికి, మూడీస్ 9.3 శాతానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. 2021 క్యాలెండర్ ఏడాదిలో 9.6 శాతం వృద్ధి నమోదు కావొచ్చని మూడీస్ అంచనా వేసింది.
- ప్రపంచ బ్యాంక్ గత జూన్‌లో దేశ జీడీపీ వృద్ధి అంచనాలను 10.1 శాతం నుంచి 8.3 శాతానికి తగ్గించింది. ఇక్రా 9 శాతం వృద్ధి అంచనాలను వెలువరించింది. బార్‌క్లేస్ గత మేలో 9.2 శాతం వృద్ధిని అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధిరేటు 9.1 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. గత జులైలో సంస్థ అంచనా 9 శాతం కాగా, ఇప్పుడు స్వల్పంగా పెంచింది. కరోనా మలి దశ అనంతరం ఆర్థిక రికవరీ స్థిరంగా కొనసాగేలా కనిపిస్తుండడం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత పండుగ సీజను ఈ ధోరణికి ఊతంగా నిలుస్తుందని ఫిక్కీ తన 'ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే'లో వెల్లడించింది. రుతుపవన వర్షాలు బాగున్నందున ఖరీఫ్ సాగు పెరిగి వ్యవసాయ రంగంపై అంచనాలను పెంచేలా చేసిందని వివరించింది.