కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించొద్దని ఇతర మంత్రిత్వ శాఖలను కోరింది.
వాటికి మాత్రమే మినహాయింపు..
కరొనా సంక్షోభం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలకు మాత్రమే ప్రస్తుతం ఖర్చుచేయనున్నట్లు తెలిపింది. ఇవి మినహా ఇతర ఏ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆమోదం తెలపబోమని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ. ఈ నేపథ్యంలో కొత్త పథకాల కోసం తమకు అభ్యర్థనలను పంపవద్దని.. అన్ని మంత్రిత్వశాఖలకు సూచించింది.