తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2020, 9:33 PM IST

ETV Bharat / business

'ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆ ఛార్జీల పెంపు లేదు'

బ్యాంకుల సర్వీస్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా సర్వీస్ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేసింది.

No service charges increase in PSBs
ప్రభుత్వ బ్యాంకుల సర్వీస్ ఛార్జీల్లో పెంపు లేదు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎలాంటి సర్వీస్ ఛార్జీల పెంపు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాలో నెలవారీ నగదు డిపాజిట్​ లావాదేవీల్లో చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయించినా.. కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రకటన చేసింది.

నెలవారీ ఉచిత క్యాష్ డిపాజిట్​, విత్​డ్రాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా నవంబర్ 1 నుంచి పలు మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ మార్పుల ప్రకారం ఇంతకుముందు ఉచిత నగదు డిపాజిట్, విత్​డ్రాల పరిమితి ఐదు లావాదేవీల వరకు ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని మూడుకు తగ్గించింది. అయితే పరిమితికి మించి చేసిన లావాదేవీలకు వర్తించే ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు అని స్పష్టం చేసింది.

ఆర్​బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు పారదర్శకంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతి ఉందని ఆర్థిక శాఖ తెలిపింది. అయినప్పటికీ కొవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఇతర ప్రభుత్వం రంగ బ్యాంకులన్ని సమీప భవిష్యత్​లో ఛార్జీలు పెంపును ప్రతిపాదించొద్దని సమాచారం ఇచ్చినట్లు తెలిపింది ఆర్థిక శాఖ.

ఇదీ చూడండి:అక్టోబర్​లో 5.4 శాతం క్షీణించిన భారత ఎగుతులు

ABOUT THE AUTHOR

...view details