ఈపీఎఫ్ఓ నిర్ణయం మేరకు భవిష్యనిధిపై 8.65శాతం వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా ఆరుకోట్ల మంది సంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
విత్త మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఈపీఎఫ్ఓ నిర్ణయించిన విధంగా 2018-19 సంవత్సరానికి 8.65శాతం వడ్డీరేటుకు ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం. కొన్ని నిబంధనలకు లోబడి వర్తించేలా ఆర్థిక సేవల విభాగం ఈ వడ్డీరేటుకు ఆమోదం తెలిపింది.
వడ్డీ రేటు పెంపు గత మూడేళ్లలో ఇదే తొలిసారి. గత ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ నేతృత్వంలోని కేంద్ర బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.