తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్యాకేజ్​ 4.0: ఆస్పత్రులు, విద్యాసంస్థలకు రూ.8100 కోట్లు - ఆత్మ్​ నిర్భర్​ భారత్​ ప్యాకేజీ

nirmala
నిర్మల సీతారామన్​

By

Published : May 16, 2020, 3:53 PM IST

Updated : May 16, 2020, 6:10 PM IST

17:13 May 16

"పీపీపీ భాగస్వామ్యంతో రీసెర్చ్‌ అండ్‌ రియాక్టర్స్‌ తయారీకి ఏర్పాటు. మెడికల్‌ ఐసోటోప్స్‌ తయారీలో భారత్‌కు గొప్ప భూమిక ఉంది. భారత మెడికల్‌ ఐసోటోప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. క్యాన్సర్‌ చికిత్సలో మెడికల్‌ ఐసోటోప్స్‌ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల తయారీలో భారత్‌ ముందుంది.

టెక్నాలజీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రోత్సాహం. కూరగాయలు, ఉల్లి వంటి ఉత్పత్తుల నిల్వకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రూపొందించేందుకు ప్రోత్సాహం. నిల్వ సామర్థ్యం పెంచే రేడియేషన్‌ సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.500 కోట్లు. ఉల్లి, టమాటా, ఆలుగడ్డలు నిల్వ సామర్థ్యాన్ని పెంచే సాంకేతికాభివృద్ధికి ప్రోత్సాహం. ఈ రంగంలో కృషిచేస్తున్న యువత, స్టార్టప్‌లకు ప్రోత్సాహం." - నిర్మలా సీతారామన్​

17:11 May 16

"అంతరిక్ష రంగంలో ఇస్రోతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలకు అవకాశం. ఉపగ్రహాల తయారీ, ప్రయోగంలో ఇస్రోతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ కల్పించేవిధంగా సంస్కరణలు. అంతరిక్ష పరిశోధనలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగానికి తగిన ప్రాధాన్యం. జియో స్పేషియల్‌ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు. జియో స్పేషియల్‌ రంగంలో పనిచేసిన భారతీయ స్టార్టప్‌లకు ప్రోత్సాహం. నీటిపారుదల, క్షామపీడిత ప్రాంతాల గుర్తింపులో పనిచేస్తున్న జియో స్పేషియల్‌ స్టార్టప్‌లకు ప్రోత్సాహం. అంతరిక్ష పరిశోధన, శాస్త్ర విజ్ఞానాభివృద్ధిలో ప్రైవేటు రంగానికి అవకాశాలు" - నిర్మలా సీతారామన్​

17:06 May 16

"సాంఘిక మౌలిక వసతుల ఏర్పాటుకు నూతన విధానం. ప్రైవేటు రంగంలో సాంఘిక మౌలిక వసతులు కల్పించేందుకు వయోబులిటీ గ్యాప్‌ ఫండ్‌. ఆస్పత్రులు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం. ఆస్పత్రులు, విద్యాసంస్థల ఏర్పాటుకు రూ.8100 కోట్లు అదనపు నిధులు."

17:00 May 16

"విద్యుత్‌ పంపిణీ రంగంలో నూతన సంస్కరణలు. విద్యుత్‌ రంగంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంల ప్రైవేటీకరణ. నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా ప్రయత్నాలు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా చర్యలు. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా డిస్కంల సంస్కరణలు. నూతన సంస్కరణలతో విద్యుత్‌ సరఫరాలో నాణ్యత, జవాబుదారీతనం పెరుగుతుంది." - నిర్మలా సీతారామన్​

16:47 May 16

"విమానయాన రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం. భారతీయ ఏరోస్పేస్ రూట్ల హేతుబద్ధీకరణ జరుగుతుంది. హేతుబద్ధీకరణతో ప్రయాణ సమయం తగ్గుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. ఇంధన పొదుపు, సమయం తగ్గడం వల్ల వినియోగదారులపై భారం తగ్గుతుంది. పీపీపీ భాగస్వామ్యంతో మరో 6 ఎయిర్‌పోర్టులకు వేలం. 12 నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి నిర్ణయం.

ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రూ.2,300 కోట్లు నిధులు. విమాన మరమ్మతుల హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం. మన విమానాలకు ఇతర దేశాల్లో మరమ్మతులు చేయిస్తుంటాం. ఎంఆర్‌వో హబ్‌ల ఏర్పాటు తర్వాత మన విమానాలతోపాటు ఇతర దేశాల విమానాలకు కూడా మరమ్మతులు జరుగుతాయి. విమానయాన రంగానికి మరమ్మతుల ఖర్చు తగ్గడం వల్ల వినియోగదారులపై భారం తగ్గుతుంది. ప్రయాణికుల విమానాలతో పాటు యుద్ధ విమానాలకు కూడా ఈ హబ్‌లలో మరమ్మతులు." - నిర్మలా సీతారామన్​

16:43 May 16

"ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేట్‌ బాడీలుగా తీర్చిదిద్దుతాం. కార్పొరేటైజ్‌ అంటే ప్రైవేటీకరణ కాదు. కార్పొరేటైజ్‌ అంటే సామర్థ్యం, నైపుణ్యాల పెంపు మాత్రమే. ఆయుధాల ఉత్పత్తి, పరిశోధనలో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు పారదర్శక నిర్ణయాలు తీసుకుంటాయి. ఆయుధాల సేరరణ, తయారీదారుల ఎంపికలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తాం. నిర్దేశిత గడువులోపే తయారీదారుల ఎంపిక, ఆయుధాల సేకరణ ఉంటుంది." - నిర్మలా సీతారామన్​.

16:39 May 16

"రక్షణ రంగంలో అత్యాధునిక సాధనా సంపత్తిని సమకూర్చుకునేందుకు దిగుమతులు తప్పవు. రక్షణ దళాలకు నాణ్యమైన, ఉన్నతమైన ఉత్పత్తులు అవసరం. ఇప్పట్నుంచి అవసరమైన దిగుమతులు చేసుకుంటేనే మేకిన్ ఇండియా ద్వారా సొంతంగా తయారీ. ఆయుధాలకు అవసరమైన విడిభాగాలను మేకిన్‌ ఇండియాలో భాగంగా తయారు చేసుకోవచ్చు. ఆయుధాలు, విడిభాగాల తయారీకి బడ్జెట్లోనే ప్రత్యేక కేటాయింపులు." - నిర్మలా సీతారామన్​

16:33 May 16

బొగ్గు తవ్వకాలు, మౌలికానికి రూ.50 వేల కోట్లు

"బొగ్గు ఉత్పత్తికి అందుబాటులోకి కొత్తగా 500 బ్లాకులు.గతంలో బొగ్గు, విద్యుత్‌ సరఫరా లేక చాలామంది పెట్టుబడుదారులు వెనక్కి వెళ్లారు. బాక్సైట్‌, బొగ్గు రెండూ కలిపి కేటాయింపులు చేస్తే పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్ది కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాం. బొగ్గు లేకుండా అల్యూమినియం ఉత్పత్తి కాదు. అల్యూమినియం ఉత్పత్తిదారులకు తగినంత బొగ్గు, బాక్సైట్‌ కలిపి కేటాయిస్తాం. బొగ్గు, బాక్సైట్‌ సంయుక్తంగా వేలం నిర్వహిస్తాం."   - నిర్మలా సీతారామన్​

16:28 May 16

"బొగ్గు, ఖనిజం, రక్షణ ఉత్పత్తులు, విమానాశ్రయాలకు ప్యాకేజీ. ఎయిరోస్పేస్‌, స్పేస్‌, యూటీల్లోని డిస్కమ్‌, అణువిద్యుత్‌శక్తి రంగానికి ప్యాకేజీ. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు. గడువులోగా బొగ్గు సరఫరా చేసిన వారికి ప్రోత్సాహకాలు. పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా బొగ్గు సరఫరా. బొగ్గును వాయువుగా మార్చేందుకు నూతన సాంకేతిక సాయం. కొత్త బొగ్గు గనులను కనుగొనేందుకు నిరంతర ప్రయత్నం. బొగ్గు తవ్వకాలకు, మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లు."  - నిర్మలా సీతారామన్​

16:22 May 16

"8 రంగాలపై ప్యాకేజీపై ప్రకటన. బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులపై ప్యాకేజీ." - కేంద్ర ఆర్థిక మంత్రి

16:18 May 16

"భారత్‌లో తయారీతో ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు. దేశవ్యాప్తంగా ఉపాధి పెంచేందుకు నూతన సంస్కరణలు ఉపయోగపడతాయి. 5 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధం చేసి పెట్టాం. 3,570 పారిశ్రామిక పార్కుల కోసం 5 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది.పెట్టుబడుల ఆకర్షణగా రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు. దేశంలో చాలారంగాలు విధానాల్లో సరళీకరణను కోరుకుంటున్నాయి."  - కేంద్ర ఆర్థికమంత్రి

16:12 May 16

కరోనా ఆర్థిక ప్యాకేజీ వివరాలను నాలుగో రోజు ప్రకటిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిర్మాణాత్మక సంస్కరణల కోసం ఈ రోజు ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

15:37 May 16

కరోనా ప్యాకేజ్​ 4.0: ఆతిథ్య, పర్యటక రంగంపై దృష్టి!

కరోనా కారణంగా గాడితప్పిన ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను నాలుగో రోజు వెల్లడించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ రోజు ఆతిథ్య, పర్యటక రంగానికి ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఎఫ్‌డీఐ, బొగ్గు, పౌర విమానయాన, మౌలిక సదుపాయాల రంగానికి సహాయ ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం.

జాతీయ మౌలిక సదుపాయాలకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ప్రస్తావించే అవకాశం. ప్రభుత్వ రంగ యూనిట్లలో పెట్టుబడులు పెట్టే విషయం కూడా ఉండవచ్చు. భూ సంస్కరణకు సంబంధించిన సమాచారం ఇవ్వొచ్చు. 

Last Updated : May 16, 2020, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details