వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశాలను సోమవారం నుంచి ప్రారంభించనుంది కేంద్రం. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేతలతో సోమవారం భేటీ కానున్నారు. కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
బడ్జెట్ సన్నాహక భేటీలు 14 నుంచి షురూ - బడ్జెట్ కసరత్తులో భాగంగా పారిశ్రామికవేత్తలతో సీతారామన్ భేటీ
2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సన్నాహక సంప్రదింపులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా పారిశ్రామిక వేత్తలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సంప్రదింపులు జరపనున్నారు.
బడ్జెట్ కసరత్తు ప్రారంభించనున్న కేంద్రం
ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. పద్దు రూపకల్పనకు ముందు ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. మోదీ 2.0 ప్రభుత్వంలో వరుసగా రెండో సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
ఇదీ చూడండి:సోమవారం నుంచి 24 గంటలూ ఆర్టీజీఎస్