ఉపాధీ హామీ పథకాన్ని మరింత విస్తరించే విధంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్. ఆర్థిక ప్యాకేజీలో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో సహా సొంత ఊళ్లకు వెళ్లిన వలస కూలీలకూ ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు.
రూ.40వేల కోట్లతో ఉపాధి హామీకి ఊతం - last tranche of EconomicPackage
ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించేందుకు అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీని ద్వారా అదనంగా 300 కోట్ల వ్యక్తిగత పనిదినాలను కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు.
కరోనా ప్యాకేజీ 5.0
ప్రకటనలో కీలక అంశాలు
- బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 61,000 కోట్లకు అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయింపు.
- అదనపు నిధులతో సుమారు 300 కోట్ల వ్యక్తిగత పనిదినాలను కల్పించేందుకు వీలు.
- లాక్డౌన్తో సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వలస కూలీలకు వర్షాకాలంలో పని కల్పించేలా చర్యలు.
- ఉత్పత్తి పెంచటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం.
- నీటి సంరక్షణ, ఇతర దీర్ఘకాలిక ఉపయోగకర ఆస్తుల అభివృద్ధికి చర్యలు.