తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫెడ్' బెంచ్​మార్క్​ వడ్డీ రేట్లు యథాతథం

బెంచ్​మార్క్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని  అమెరికా ఫెడరల్​ రిజర్వు బ్యాంక్​ నిర్ణయం తీసుకుంది. ఫెడ్​ కీలక వడ్డీ రేట్ల శ్రేణి ప్రస్తుతం 1.5 శాతం నుంచి 1.75 శాతం మధ్య కొనసాగుతోంది.

FED
ఫెడరల్​ రిజర్వు బ్యాంక్

By

Published : Dec 12, 2019, 2:14 PM IST

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని అమెరికా ఫెడరల్​ రిజర్వు బ్యాంక్​​ బుధవారం నిర్ణయించింది. 2020లోనూ బెంచ్​మార్క్​ వడ్డీ రేట్లలో పెద్దగా మార్పు ఉండదని ఫెడ్​ సంకేతాలిచ్చింది.

బెంచ్​మార్క్​ వడ్డీ రేట్ల శ్రేణి 1.5 నుంచి 1.75 శాతం మధ్యే కొనసాగనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది​.

నిరుద్యోగ సమస్య పెద్దగా లేకపోవడం, ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఫెడ్ కమిటీ. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించింది ఫెడరల్ రిజర్వు బ్యాంకు.

చైనాతో వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించదన్న విషయాన్ని ఫెడ్​ తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది.

ఇదీ చూడండి:మా పూర్వీకులది తమిళనాడే: బ్రిటన్​ కుబేరుడు

ABOUT THE AUTHOR

...view details