భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) గణనీయంగా పెరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఈక్విటీ ఎఫ్డీఐలు 40 శాతం పెరిగి.. 51.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
2019-20 తొలి తొమ్మిది నెలల(55.14 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే.. 2020-21లో 22 శాతం అధికంగా(67.54 బిలియన్ డాలర్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. 2020-21 మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఎఫ్డీఐలు 37 శాతం పెరిగ్గా... డిసెంబర్లో ఎఫ్డీఐలు ఏకంగా 24 శాతం వృద్ధి చెందాయి.