గత ఆర్థిక సంవత్సరం(2020-21) భారత్‌కు 59.64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం 19శాతం ఎక్కువని వెల్లడించింది. సరళమైన విధానాలు, సులభతర వాణిజ్యం వంటివి ఎఫ్డీలు పెరిగేందుకు కారణమైనట్లు పేర్కొంది.
ఈక్విటీ, రీ-ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, మూలధన పెట్టుబడులు అన్ని కలిపి గత ఏడాది భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు 81.72 బిలియన్ డాలర్లుగా తెలిపింది వాణిజ్య మంత్రిత్వ శాఖ. 2019-20లో నమోదైన 74.39 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో పోలిస్తే.. ఈ మొత్తం 10 శాతం ఎక్కువ.
ఏ రంగానికి ఎంత?