తెలంగాణ

telangana

ETV Bharat / business

'గత ఆర్థిక ఏడాదిలో 13శాతం పెరిగిన ఎఫ్​డీఐలు'

2018-19 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2018-19 లో కంటే.. 13 శాతం మేర ఎఫ్​డీఐలు పెరిగినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

FDI in India jumps 13 pc to record USD 49.98 bn in 2019-20
ఈ ఆర్థిక ఏడాదిలో పెరిగిన విదేశీ పెట్టుబడులు

By

Published : May 28, 2020, 10:05 PM IST

2019-20 ఆర్థిక ఏడాదికి సంబంధించి.. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. గత ఆర్థిక ఏడాది ఎఫ్​డీఐలు 13 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

2018-19లో 44.36 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎఫ్​డీఐలు రాగా.. 2019-20లో 49.98 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇదే ఏడాదిలో సర్వీస్‌ సెక్టార్‌లోకి అత్యధికంగా 7.85 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు రాగా.. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో 7.67 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. టెలీకమ్యూనికేషన్ల రంగంలో 4.44 బిలియన్లు, ట్రేడింగ్‌ 4.57, ఆటోమొబైల్ 2.82, నిర్మాణ రంగంలో 2 బిలియన్లు, కెమికల్స్‌ సెక్టార్‌లోకి ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు వచ్చినట్లు 'డిపార్ట్‌మెంట్ ఫర్‌ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్‌ ట్రేడ్(డీపీఐఐటీ)' గణాంకాలు వెల్లడించాయి.

గత ఆర్థిక ఏడాదిలో భారత్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టిన దేశాల జాబితాలో 14.67 బిలియన్లతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మారిషస్, నెదర్లాండ్స్, అమెరికా, కేమెన్ ఐలాండ్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:ఆధార్ ఉంటే చాలు.. ఇక క్షణాల్లో ఈ- పాన్

ABOUT THE AUTHOR

...view details