పాండోరా పేపర్స్ తరహాలో 'ఫేస్బుక్ పేపర్స్' (Facebook papers leak) కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. అయినప్పటికీ.. జులై- సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో(Facebook results today) ఫేస్బుక్ జోరు చూపించింది. ఫలితాల్లో 17 శాతం నికర లాభం నమోదైంది. ఇది గతంతో పోల్చితే దాదాపు 9 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 67 వేల కోట్లు) అధికం. ఇందులో ఎక్కువ భాగం అడ్వర్టైజ్మెంట్స్(ప్రకటనలు) వల్లేనని పేర్కొంది.
గతేడాది ఇదే సమయంలో.. నికర లాభం 7.85 బిలియన్ డాలర్లుగా ఉంది. సంస్థ ఆదాయం దాదాపు 35 శాతం పెరిగి.. 29.01 బిలియన్ డాలర్లకు చేరింది. విశ్లేషకుల అంచనాలను మించి.. ఫేస్బుక్ రాణించింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే.. కంపెనీ షేరు విలువ (Facebook share price) 2.5 శాతం మేర దూసుకెళ్లింది.
ఫేస్బుక్ పేపర్స్ (Facebook Papers documents) ఏంటి..?
అమెరికాలోని అసోసియేటెడ్ ప్రెస్ సహా 17 వార్తా సంస్థలు జట్టుకట్టి ఫేస్బుక్ పేపర్స్(Facebook papers leak) ప్రాజెక్టును(facebook papers) చేపట్టాయి. సామాజిక మాధ్యమ సంస్థకు సంబంధించి వేలాది అంతర్గత పత్రాల సమాచారాన్ని వెలికితీశాయి. ఫేస్‌బుక్‌కు ప్రజాప్రయోజనాల కంటే లాభార్జనే ముఖ్యమని ఇవి బట్టబయలు చేశాయి.