తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిరిండియాలో ఎస్​పీవీ - స్పెషల్​ పర్పస్​ వెహికల్​

ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం స్పెషల్​ పర్పస్​ వెహికల్​ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఎయిరిండియాలో ఎస్​పీవీ

By

Published : Mar 1, 2019, 6:10 AM IST

Updated : Mar 1, 2019, 7:23 AM IST

ఎయిరిండియా, నాలుగు అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం స్పెషల్​ పర్పస్​ వెహికల్​ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎయిరిండియా అసెట్​ హోల్డింగ్​ లిమిటెడ్​గా నామకరణం చేసిన ఈ సంస్థకు... రూ. 29వేల464 కోట్ల రుణాలను బదిలీ చేయటానికి కూడా సమ్మతం తెలిపింది మంత్రి వర్గం.

ఎయిరిండియాలో ఎస్​పీవీ

నాలుగు అనుబంధ సంస్థలు ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినవి కాదు. ప్రస్తుతం ఎయిరిండియాకు రూ. 55,000 కోట్ల అప్పులున్నట్లు అంచనా.

సాప్ట్​వేర్​ ఉత్పత్తులకు జాతీయ విధానం

దేశంలో సాప్ట్​వేర్​ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా జాతీయ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాప్ట్​వేర్​ ఉత్పత్తులకు భారత్​ను కేంద్రంగా మార్చటం, 2025 లోపు 65 లక్షల ఉద్యోగాల సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించింది.

"భారత్​లో ఐటీ ఆదాయం 16,800 కోట్ల డాలర్లు ఉంది. ఇందులో సాప్ట్​వేర్​ ఉత్పత్తుల ద్వారా వచ్చేది కేవలం 710 కోట్ల డాలర్లే. ప్రస్తుతం దేశం సాప్ట్​వేర్​ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది" అని కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు.

ప్రపంచ స్థాయికి దిల్లీ ఎయిమ్స్​...

ప్రపంచస్థాయి వైద్య విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దిల్లీ ఎయిమ్స్​ పునరాభివృద్ధికి సూత్రప్రాయం అంగీకారం తెలిపింది కేంద్ర మంత్రి వర్గం.

Last Updated : Mar 1, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details