భారత ఎగుమతులు జులైలో రికార్డు స్థాయిలో 47.19 శాతం పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెల 35.17 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి.
పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలకు పెరిగిన డిమాండ్ ఎగుమతుల వృద్ధికి కారణంగా తెలిపింది వాణిజ్య శాఖ. అయితే.. ఆయిల్ సీడ్స్, బియ్యం, మాంసం, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం భారీగా క్షీణించినట్లు పేర్కొంది.
ఇదే సమయంలో (జులైలో) దిగుమతులు కూడా 59.38 శాతం పెరిగి.. 46.40 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య శాఖ డేటా ద్వారా వెల్లడైంది. ఫలితంగా జులై నెలకు గానూ.. భారత వాణిజ్య లోటు 11.23 బిలియన్ డాలర్లుగా నమోదైంది.