ఈ ఏడాది జనవరిలో దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2020 మొదటి నెలతో పోలిస్తే గత నెల ఎగుమతులు 5.37శాతం వృద్ధితో 27.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఫార్మా ఎగుమతులు 16.4 శాతం (293 మిలియన్ డాలర్లుకు), ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 19 శాతం వృద్ధి (1.16 బిలియన్ డాలర్లకు) నమోదవటం వల్ల మొత్తం ఎగుమతులు పెరిగినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.