భారత్ ఎగుమతులు వరుసగా మూడో నెల పడిపోయాయి. మే నెలలో 36.4శాతం(19.05 బిలియన్ డాలర్లు) మేర ఎగుమతులు క్షీణించాయి. పెట్రోలియం, టెక్స్టైల్, ఇంజినీరింగ్, ఆభరణాల ఎగుమతులు భారీగా తగ్గడమే ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది.
మే నెలలో దిగుమతులు కూడా తగ్గాయి. 51శాతం తగ్గి 22.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీనితో వాణిజ్య లోటు 3.15బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది మే నెలలో ఇది 15.36బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య-పారిశ్రామిక మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి.