తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2020, 7:26 PM IST

ETV Bharat / business

తగ్గిన వాణిజ్యలోటు- నవంబర్​లో 9.87%

దేశీయ ఎగుమతులు నవంబర్​లో 8.74 శాతం తగ్గి.. 23.52 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులూ 13.32 శాతం క్షీణించి.. 33.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో దేశ వాణిజ్య లోటు గత నెల 9.87 శాతానికి దిగొచ్చినట్లు అధికారిక గణాంకాల్లో తేలింది.

Trade deficit narrows in November
నవంబర్​లో దిగొచ్చిన భారత వాణిజ్య లోటు

దేశ ఎగుమతులు నవంబర్​లోనూ భారీగా తగ్గాయి. గత నెల మొత్తం ఎగుమతులు 8.74 శాతం తగ్గి.. 23.52 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, రత్నాలు, ఆభరణాల షిప్మెంట్లలో క్షీణతే ఇందుకు కారణమని అధికారిక గణాంకాల్లో తేలింది.

ఇదే సమయంలో దేశ దిగుమతులూ 13.32 శాతం తగ్గి.. 33.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో నవంబర్​లో వాణిజ్య లోటు 9.87 బిలియన్​ డాలర్లకు దిగొచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

చమురు దిగుమతులు నవంబర్​లో 43.36 శాతం తగ్గి 6.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

2020-21 గణాంకాలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య మొత్తం ఎగుమతులు 17.76 శాతం తగ్గి..173.66 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఏకంగా 33.55 శాతం తగ్గి 215.69 బిలియన్​ డాలర్లకు చేరాయి.

ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో దేశ వాణిజ్య లోటు 42 బిలియన్ డాలర్లుకు దిగొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వాణిజ్య లోటు 113.42 బిలియన్​ డాలర్లుగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:'కరోనా కాలంలోనూ ఎఫ్​డీఐల జోరు'

ABOUT THE AUTHOR

...view details