తెలంగాణ

telangana

ETV Bharat / business

​​​​​​​డిసెంబర్​లోనూ నిరాశపరిచిన భారత ఎగుమతులు! - వ్యాపార వార్తలు

భారత ఎగుమతులు డిసెంబర్​లో 1.8 శాతం తగ్గి 27.36 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి. వరుసగా ఐదు నెలలుగా దేశీయ ఎగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన తొమ్మిది నెలల్లో ఎగుమతులు 1.96 శాతం మేర క్షీణించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

EXPORTS
ఎగుమతులు తగ్గాయ్​

By

Published : Jan 15, 2020, 9:37 PM IST

Updated : Jan 15, 2020, 11:17 PM IST

దేశ ఎగుమతుల్లో వరుసగా ఐదో నెలలోనూ తగ్గుదల నమోదైంది. 2019 డిసెంబర్​లో దేశీయ ఎగుమతులు 1.8 శాతం క్షీణించి.. 27.36 బిలియన్​ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దిగుమతుల్లోనూ..

డిసెంబర్​లో దిగుమతులూ 8.83 శాతం తగ్గి.. 38.61 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది ప్రభుత్వం.

సమీక్షా నెలలో వాణిజ్య లోటు 11.25 బిలియన్​ డాలర్లుకు చేరింది. 2018 డిసెంబర్​లో వాణిజ్య లోటు 14.49 బిలియన్​ డాలర్లుగా ఉండటం గమనార్హం.

ఆయిల్​ దిగుమతులు 0.83 శాతం తగ్గి.. 10.69 బిలియన్​ డాలర్లుకు, బంగారు దిగుమతులు 4 శాతం తగ్గి.. 2.46 బిలియన్​ డాలర్లకు చేరాయి.

గడిచిన తొమ్మిది నెలల్లో ఇది పరిస్థితి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-డిసెంబర్​ మధ్య ఎగుమతులు 1.96 శాతం క్షీణించి 239.29 బిలియన్​ డాలర్లకు చేరాయి. దిగుమతులు 8.9 శాతం తగ్గి.. 357.39 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ తొమ్మిది నెలల కాలంలో వాణిజ్య లోటు 118.10 బిలియన్​ డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:సమ్మె సైరన్​: ఈనెల 31, ఫిబ్రవరి 1న బ్యాంకులు బంద్​

Last Updated : Jan 15, 2020, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details