దేశ ఆర్థిక వృద్ధిలోసూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం వాటా దాదాపు 29 శాతం. 48 శాతం ఎగుమతులు దీని ద్వారానే జరుగుతుంటాయి. అతిపెద్ద ఉపాధి సృష్టికర్త కూడా ఇదే. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ రంగంపై.. కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఉత్పత్తి నిలిచిపోయి, ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నడుమ ఎంఎస్ఎంఈలు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకుంటామని సంకేతాలిచ్చారు. మంచి ప్యాకేజీతో.. త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని చూస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.