తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఐరోపాకు కరోనా గండం- సున్నా దిగువకు వృద్ధిరేటు!'

కరోనా ప్రభావంతో ఐరోపా దేశాల వృద్ధి రేటు సున్నా దిగువకు చేరుతుందని యూరోపియన్​ కమిషన్​ హెచ్చరించింది. చైనా తర్వాత ఐరోపాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న వేళ కమిషన్​ ఈ వ్యాఖ్యలు చేసింది.

EC-CORONA
కరోనా

By

Published : Mar 14, 2020, 10:43 AM IST

కరోనా వైరస్​తో ఐరోపా ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లుతుందని యూరోపియన్ కమిషన్ (ఈసీ) హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఖండంలోని దేశాల వృద్ధి రేటు మైనస్​లలో పడిపోతుందని అభిప్రాయపడింది.

"ఐరోపా ప్రాంతంలో పరిస్థితిని చూస్తే ఈ ఏడాది వృద్ధి రేటు సున్నాకు చేరుతుంది. మరింత దిగజారితే సున్నాకు తక్కువలో పడే అవకాశం ఉంది."

- ఐరోపా కమిషన్​

చైనాలో తగ్గుముఖం పట్టిన భయంకర మహమ్మారి కరోనా ప్రస్తుతం ఐరోపాలో విస్తరిస్తోంది. ఇటలీ సహా పలు ఐరోపా దేశాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐరోపా.. కరోనాకు కేంద్ర బిందువుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి:కరోనాకు కేంద్ర బిందువుగా ఐరోపా: డబ్ల్యూహెచ్​ఓ

ABOUT THE AUTHOR

...view details