తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈపీఎఫ్​ చందాదారులకు రూ.280 కోట్లు చెల్లింపు - కరోనా న్యూస్

లాక్​డౌన్​ నేపథ్యంలో ఉద్యోగులకు నగదు సమస్య తలెత్తకుండా ప్రవేశపెట్టిన ఈపీఎఫ్​ ఉపసంహరణ పథకానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 1.37 లక్షల మంది చందాదారులు దరఖాస్తు చేసుకున్నట్లు ఈపీఎఫ్​ఓ తెలిపింది. వారికి రూ.280 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేసింది.

epfo
ఈపీఎఫ్​ఓ

By

Published : Apr 10, 2020, 3:22 PM IST

దేశవ్యాప్త లాక్‌డౌన్ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెలుసుబాటు మేరకు.. లక్షా 37 వేల మంది చందాదారుల నగదు ఉపసంహరణ అభ్యర్థనల్ని పరిష్కరించినట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ)ప్రకటించింది. వీరందరికీ కలిపి మొత్తం రూ.280 కోట్లు చెల్లించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

పూర్తి కేవైసీ సదుపాయం ఉన్న చందాదారులకు అభ్యర్థనను 72గంటల్లోనే పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఇతర కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనలనూ వీలైనంత త్వరగా పరిష్కరించే యత్నం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ వివరించింది.

భారీ సంఖ్యలో నగదు ఉపసంహరణ ఎందుకు?

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన కింద భవిష్యనిధి ఖాతాలోని 75 శాతం లేదా 3 నెలల వేతనంలో ఏది తక్కువ ఉంటే అది తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పించింది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: ఆ విమానాల్లో ఇక భోజనాలు బంద్

ABOUT THE AUTHOR

...view details