తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2021, 2:21 PM IST

Updated : Mar 4, 2021, 3:02 PM IST

ETV Bharat / business

2020-21కి ఈపీఎఫ్​ వడ్డీ రేటు 8.5%

EPF interest rate for this fiscal
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్​ వడ్డీ రేటు

14:19 March 04

2020-21కి ఈపీఎఫ్​ వడ్డీ రేటు 8.5%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయించింది ఈపీఎఫ్​ఓ. జమ్ము కశ్మీర్‌ శ్రీనగర్‌లో గురువారం జరిగిన కేంద్ర ధర్మకర్తల బోర్డు సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2020-21కి తక్కువ వడ్డీ ఇవ్వొచ్చని ఇటీవల ఉహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా కరోనా వల్ల చందాదారుల నుంచి డిపాజిట్ల మొత్తం తగ్గటం సహా పలు కారణాలతో వడ్డీ రేటు తగ్గించొచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఈపీఎఫ్​ఓ మాత్రం వడ్డీ రేటును యథతథంగా కొనసాగించడం గమనార్హం.

2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​పై వడ్డీ రేటు 8.65 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బోర్డు దాన్ని 8.5 శాతానికి తగ్గించింది. అంతకు ముందు ఏడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్ప వడ్డీ రేటు.

Last Updated : Mar 4, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details