ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు సంపన్నులకు అధిక పన్ను ఉపశమనం కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు కీలక 6 అంశాల్లో ప్రణాళికలను సవివరంగా ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
"స్వల్ప, దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్ఛార్జి నుంచి ఉపశమనం కల్పిస్తున్నాం. ఈ బడ్జెట్లోని 111-ఏ, 112-ఏలను ఎత్తివేస్తున్నాం. అంటే విదేశీ సంస్థాగత మదుపర్లపై సర్ఛార్జి ఉండదు. ఫలితంగా బడ్జెట్ ముందు ఉన్న నిబంధనలు అమలులోకి వస్తాయి.
డీపీఐఐటీలో రిజిస్టర్ అయిన అంకుర సంస్థలకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.