తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని, సేవల రంగమూ మెరుగైందని, నగదు లభ్యత పరిస్థితులు సౌకర్యవంతంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా వ్యాసం 'స్టేట్ ఆఫ్ ఎకానమీ'లో పేర్కొంది. కరోనా వైరస్ ఉద్ధృతిని నియంత్రించేదుకు విధించిన ఆంక్షల సడలింపుతో గిరాకీ పెరిగిందని, సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపింది.
దేశంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నందున, వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. ఆంక్షలు సడలించాక.. ప్రజల రాకపోకలు కొవిడ్ రెండో దశ మునుపటి స్థాయి (2021 ఫిబ్రవరి)కి చేరాయని తెలిపింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర నేతృత్వంలోని బృందం ఈ వ్యాసాన్ని రచించింది.
ఐపీఓల నామ సంవత్సరం