తెలంగాణ

telangana

ETV Bharat / business

రాహుల్​ గాంధీకి కేంద్రమంత్రి 'పెళ్లి సందడి' పంచ్​ - Union Minister Suresh Angadi marriage

దేశంలో ఆర్థిక మందగమనం నెలకొందన్న విపక్షాల విమర్శల్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు కేంద్ర మంత్రి సురేశ్​ అంగడి. ఆర్థిక వ్యవస్థ బాగుందనేందుకు ప్రజలకు పెళ్లిళ్లు కావడం, విమానాశ్రయాలు రద్దీగా ఉండడమే నిదర్శనమని చెప్పారు.

రాహుల్​ గాంధీకి కేంద్రమంత్రి 'పెళ్లి సందడి' పంచ్​

By

Published : Nov 15, 2019, 4:26 PM IST

Updated : Nov 15, 2019, 6:21 PM IST

"క్షీణించిన వృద్ధిరేటు... పెరిగిన ద్రవ్యోల్బణం... 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలు తగ్గింపు"... కొంతకాలంగా ఎక్కడ చూసినా ఇవే ముఖ్యాంశాలు. వృద్ధి గణాంకాలను ఆసరాగా చేసుకుని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. మోదీ సర్కార్​ ఆర్థిక విధానాలే ఈ పరిస్థితి కారణమంటూ... "మోదీనామిక్స్​" అనే కొత్త పదాన్నీ సృష్టించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.

ఆర్థిక పరిస్థితిపై విపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టారు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్​ అంగడి.

"ప్రతి మూడేళ్లకు డిమాండ్​ తగ్గుతుంది. తర్వాత పుంజుకుంటుంది. ఇది ఎప్పుడూ జరిగేదే.
విమానాశ్రయాలు, రైళ్లు రద్దీగా ఉన్నాయి. ప్రజలకు పెళ్లిళ్లు అవుతున్నాయి. అంతా బాగున్నా కొందరు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారు."
-సురేశ్​ అంగడి, కేంద్ర మంత్రి

దిల్లీలో త్వరలో ప్రారంభం కానున్న సరుకు రవాణా నడవాను పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సురేశ్​.

Last Updated : Nov 15, 2019, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details