వాణిజ్యపరమైన తవ్వకానికి ఉపయోగించే బొగ్గు గనుల వేలాన్ని ప్రధాని మోదీ ఈ నెల 18న ప్రారంభించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం బొగ్గును వదలడం అనే నేపథ్యంతో ఈ వేలం ప్రారంభం కానుందని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు.. ఈ నెల 18న దేశంలో తొలిసారి వాణిజ్యపరమైన తవ్వకాలకు బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.
తొలిసారిగా వేలానికి బొగ్గుగనులు.. ఎందుకంటే..? - Economical coal minings will come into auction on Jun'18
దేశంలో తొలిసారి వాణిజ్యపరమైన తవ్వకాలకు బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ వేలాన్ని జూన్ 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ట్వీట్ చేశారు.
తొలిసారి వేలానికి వాణిజ్యపరమైన బొగ్గుగనులు
బొగ్గు రంగంలో స్వావలంబన కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేంద్ర బొగ్గుమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపాదిత వేలంలో.. అడ్వాన్స్ మొత్తాన్ని తగ్గించడం సహా రాయల్టీకి వ్యతిరేకంగా ముందస్తు మొత్తాన్ని సర్దుబాటు చేయడం వంటివి ఉన్నాయి. వీటితో పాటు బొగ్గు గనుల నిర్వహణను ప్రోత్సహించడం కోసం గతంలో కంటే ఉదారంగా ప్రమాణాలు ఉంటాయని పేర్కొంది.
Last Updated : Jun 12, 2020, 6:50 AM IST
TAGGED:
Coal minings Auction