వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 6 నుంచి 6.5 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
ప్రస్తుత పరిస్థితి..
"అంతర్జాతీయంగా బలహీన వృద్ధి రేటు ప్రభావం భారత్‌పై పడింది. ఆర్థిక రంగంలో నెలకొన్న సమస్యలతో పెట్టుబడులు తగ్గి దేశ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పదేళ్ల కనిష్ఠానికి తగ్గింది" అని సర్వే పేర్కొంది.