ప్రపంచార్థికం వచ్చే ఏడాది చివరి నాటికి తిరిగి కరోనా సంక్షోభం ముందున్న స్థాయికి చేరుతుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఆశాభావం వేసింది. దేశాల వారీగా ఆర్థిక వ్యవస్థల రికవరీల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తాజాగా వెల్లడించింది. అర్థిక వ్యవస్థపై ప్రస్తుతం సానుకూల అంచనాలు ఉన్నప్పటికీ.. భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేసింది.
సానుకూలతలకు కారణాలు..
వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమవుతున్నట్లు వస్తున్న వార్తల వల్ల.. కొవిడ్ సంక్షోభం ప్రారంభమయ్యాక తొలిసారి ఆర్థిక వృద్ధి రేటుపై సానుకూల అంచనాలు వచ్చినట్లు ఓఈసీడీ పేర్కొంది.