దేశంలో ఈ వేబిల్స్‌కు పెరిగిన డిమాండే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనే విషయాన్ని వెల్లడిస్తోందని జీఎస్టీ నెట్‌వర్క్ పేర్కొంది. ఈ సంస్థ జీఎస్టీకి ఐటీ సేవలను అందజేస్తోంది. ప్రస్తుత డేటా చూస్తుంటే జులైలో జీఎస్టీ కలెక్షన్ల వృద్ధిరేటు ఖాయమని తెలిపింది. జూన్ 30 ఒక్కరోజే 1.83 మిలియన్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయినట్లు వెల్లడించింది. వీటి విలువ రూ.54,500 కోట్లని పేర్కొంది. సాధారణ రోజుల్లో రోజుకు 20లక్షల వరకు జనరేట్ చేస్తుంది.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఈ-వే బిల్లులే రుజువు - GST Network
కరోనా కారణంగా దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. అయితే ప్రస్తుతం వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లాక్‌డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవ్యస్థ కాస్త పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఈ వేబిల్స్‌కు పెరిగిన డిమాండే ఇది స్పష్టం చేస్తుందని జీఎస్టీ నెట్‌వర్క్ పేర్కొంది.
మార్చిలో ఈ-వే బిల్లుల జనరేషన్ భారీగా పతనమైంది. మార్చి 25నాటికి అత్యల్పంగా కేవలం 50వేలు మాత్రమే జనరేట్ అయ్యాయి. అదే రోజు దేశంలో లాక్‌డౌన్ మొదలైంది. తాజా నిబంధనలు తొలగిస్తుండటం వల్ల వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. "భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా లాక్‌డౌన్ ముందునాటి పరిస్థితులకు చేరుకుంటోంది. జీఎస్టీ వసూళ్లు వేగంగా పెరుగుతున్నాయి" అని జీఎస్‌టీఎన్ పేర్కొంది. జూన్ నెల జీఎస్టీ వసూళ్లు రూ.90,017గా నిలిచాయి. ఇవి ఏప్రిల్‌లో రూ.62,009గా ఉన్నాయి.
ఇదీ చూడండి:ఆదాయపు పన్ను 'టీడీఎస్' ఫారమ్‌లో మార్పులు