తెలంగాణ

telangana

ETV Bharat / business

GST Council Meet: వ్యాక్సిన్లపై జీఎస్​టీ తగ్గేనా? - జీఎస్​టీ మండలి భేటీలో వ్యాక్సిన్​పై పన్ను తొలగింపు అంశంపై చర్చ

దేశాన్ని కరోనా సంక్షోభం కుదిపేస్తున్న వేళ భారీ అంచనాల నడుమ జీఎస్​టీ మండలి(GST council meet) భేటీ అయ్యింది. కొవిడ్ వ్యాక్సిన్(covid vaccine) వైద్య పరికరాలపై జీఎస్​టీ తగ్గింపు అంశం ఈ సమావేశంలో ప్రధాన చర్చాశంగా ఉంది. ఈ ఏడాది జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. వర్చువల్​గా జరుగుతున్న ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తున్నారు.

Discussion on the topic of GST removal on corona vaccine
జీఎస్​టీ మండలి భేటీలో ప్రధాన చర్చాంశం

By

Published : May 28, 2021, 12:56 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన 43 జీఎస్​టీ మండలి (GST Council Meet) సమావేశమైంది. కరోన నేపథ్యంలో వర్చువల్​గా మండలి భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర అధికారులు పొల్గొన్నారు.

జీఎస్​టీ మండలి భేటీ కావడం ఈ ఏడాది ఇదే తొలిసారి. చివరిసారిగా అక్టోబర్ 5న జీఎస్​టీ మండలి(GST council meet) సమావేశమైంది.

భేటీలో చర్చాంశాలు..

భాజపాయేతర పాలిత రాష్ట్రాల (రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, కేరళ, బంగాల్‌) ఆర్థిక మంత్రులు సంయుక్త వ్యూహాన్ని అనుసరించాలని, కొవిడ్‌ అత్యవసరాలపై జీఎస్‌టీ లేకుండా (జీరో ట్యాక్స్‌) చూడాలని కోరబోతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు(COVID vaccine), వైద్య పరికరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపు, రాష్ట్రాలకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో అధిక పరిహారం చెల్లింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.

మీడియా ముందుకు సీతారామన్​..

భేటీ ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడనున్నారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నారు.

ఇదీ చదవండి:ఎఫ్​డీఐ పాలసీకి కేంద్రం సవరణ!

ABOUT THE AUTHOR

...view details