2018-19లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రభుత్వ లక్ష్యం కంటే తగ్గాయి. ప్రభుత్వం 12 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ రూ.82వేల కోట్లు తగ్గి రూ.11.18 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ పన్నుల వసూళ్ల తక్కువగా ఉండటమే దీనికి కారణం.
ప్రభుత్వ లక్ష్యానికి 18 శాతం తక్కువగా వసూలైనప్పటికీ.. క్రితం ఏడాదితో పోల్చితే ఇది 13.4 శాతం అధికం.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాలు తగ్గిపోయిన ప్రభావం పన్నులపై పడింది. కొన్ని ప్రాంతాల్లో క్రితం సారి కంటే తక్కువ పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.