ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్స్ చేసిన వారి సంఖ్య భారీగా పెరిగింది. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో వార్షిక వృద్ధి రేటులో ఈ సంఖ్య 55.1 శాతంగా నమోదైంది. ఐదేళ్ల క్రితం 593.61 కోట్ల డిజిటల్ చెల్లింపులు చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య 3,434 కోట్లకు ఎగబాకింది.
ఈ వ్యవధిలోనే డిజిటల్‌గా బదిలీ అయిన సొమ్ము వివరాలు చూస్తే.. ఐదేళ్ల క్రితం రూ. 920.38 లక్షల కోట్లు బదిలీ కాగా 2020లో ఆ విలువ రూ.1,623 లక్షల కోట్లకు పెరిగింది.
ఏడాదికి ఎంతెంత?
సంవత్సరం | డిజిటల్ చెల్లింపుల సంఖ్య (కోట్లలో) | బదిలీ అయిన సొమ్ము(రూ. లక్ష కోట్లలో) |
2015-16 | 595.61 | 920.38 |
2016-17 | 969.12 | 1,120.99 |
2017-18 | 1,459 | 1,369.86 |
2018-19 | 2,343.40 | 1,638. 52 |
2019-20 | 3,434.56 | 1,623 |
ఈ ఏడాది బదిలీ అయిన సొమ్ము విలువ స్వల్పంగా తగ్గినా మొత్తంగా ఐదేళ్లలో చూస్తే ఈ విలువ చాలా మేరకు పెరిగిందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది.