తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​లో క్రెడిట్​ స్కోరు తగ్గిందా? - క్రెడిట్ స్కోర్ అవసరమెంత

ఏప్రిల్ , మే నెలల్లో క్రెడిట్ కార్డులిచ్చే సంస్థలు తమ పోర్ట్​ఫోలియోను సమీక్షించుకున్నాయి. దీనిలో భాగంగా వినియోగదారుల్లో చాలా మందికి క్రెడిట్​కు సంబంధించి మార్పులు చేశాయి. కొంత మందికి క్రెడిట్ లిమిట్​ను తగ్గించాయి. దీనివల్ల క్రెడిట్ స్కోరు తగ్గి భవిష్యత్తులో రుణాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మరి ఇప్పుడు మీ స్కోరు​ పెరిగేందుకు ఏం చేయాలి?

lock down impact on Credit Score
క్రెడిట్​ స్కోర్​పై లాక్​డౌన్​ ప్రభావం

By

Published : Jun 20, 2020, 2:58 PM IST

కరోనా మాహమ్మారిని నియంత్రించేందుకు విధించిన లాక్​డౌన్ వల్ల చాలా మందిపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది. క్యాష్ ఫ్లో తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకులూ వినియోగదారుల రుణ సామర్థ్యాన్ని సమీక్షించాయి. దీనివల్ల చాలా మంది క్రెడిట్ లిమిట్ తగ్గిపోయింది. ఈ ప్రభావం మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడొచ్చు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే స్కోరు పడిపోతుంది.

స్కోరు మెరుగుపరుచుకోవడం ఎలా?

సాధారణంగా క్రెడిట్ యుటిలైజేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత వరకు క్రెడిట్ స్కోరు ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. సాధారణంగా క్రెడిట్ యుటిలైజేషన్ 30 శాతం కంటే తక్కువ ఉండాలని నిపుణులు అంటున్నారు. క్రెడిట్ కార్డు అసలు ఉపయోగించనట్లైతే.. క్రెడిట్ యుటిలైజేషన్ అనేది ఉండదు.

ఉదాహరణకు క్రెడిట్ లిమిట్ రూ.లక్ష ఉందనుకోండి. రూ. 80వేలు ఉపయోగించుకున్నట్లయితే క్రెడిట్ యుటిలైజేషన్ 80 శాతం అవుతుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు అవుట్ స్టాండింగ్ మొత్తం ఉన్నట్లైతే.. ఇటీవల క్రెడిట్ లిమిట్ తగ్గించటం వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ పెరుగుతుంది.

రూ.లక్ష క్రెడిట్ లిమిట్​లో 20 వేలు ఖర్చు పెట్టినట్లైతే.. యుటిలైజేషన్ 20 శాతం అవుతుంది. ఇలాంటి సమయంలో క్రెడిట్​ లిమిట్ రూ.30 వేలకు తగ్గిందనుకోండి.. అప్పుడు క్రెడిట్ యుటిలైజేషన్ 66.6 శాతానికి పెరుగుతుంది. దీని వల్ల క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది.

ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులు ఆ ఫోర్ట్ ఫోలియోను రివ్యూ చేసినప్పుడు కొంత మందికి క్రెడిట్ లిమిట్ 80 శాతం వరకు తగ్గింది. అప్పటికే అవుట్ స్టాండింగ్ ఉన్నవాళ్ల క్రెడిట్ స్కోరును ఇది చాలా వరకు ప్రతికూలంగా ప్రభావితం చేసింది.

అవుట్ స్టాండింగ్ తగ్గించుకోవాలి...

క్రెడిట్ యుటిలైజేషన్ ఎక్కువ ఉన్నట్లైతే.. వినియోగదారుకు ఎక్కువ మొత్తం అవసరం ఉన్నట్లుగా బ్యాంకులు పరిగణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్​ను తగ్గించినట్లయితే క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

స్కోరుతో పనేంటి?

రుణాలిచ్చే సమయంలో క్రెడిట్ స్కోరు అనేది చాలా కీలకం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు దీని ఆధారంగానే మీకు రుణాలివ్వాలా? వద్దా? అని నిర్ణయిస్తాయి.

క్రెడిట్ స్కోరును గణించేటప్పుడు క్రెడిట్ బ్యూరోలు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ కార్డు ఉపయోగించే తీరును ముఖ్యంగా గమనిస్తాయి. లిమిట్​లో ఎంత వరకు ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని (క్రెడిట్ యుటిలైజేషన్) పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు పరిగణనలో దీనికి 30 శాతం వెయిటేజీ ఉంటుంది.

క్రెడిట్ స్కోరు.. రుణాలు..

ప్రభుత్వ రంగ బ్యాంకులైతే.. 700, ఆపై స్కోరు ఉన్న వారికే రుణాలు ఇస్తాయి. ప్రైవేటు బ్యాంకులు 700, అంత కంటే ఎక్కువ స్కోరును పరిగణిస్తాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాత్రం 700 కంటే తక్కువ క్రెడిట్ స్కోరున్నప్పటికీ రుణాలిస్తాయి.

ఇదీ చూడండి:అన్న అప్పులు సున్నా.. తమ్ముడి సంపద సున్నా

ABOUT THE AUTHOR

...view details