తెలంగాణ

telangana

ETV Bharat / business

టీకా తీసుకుంటే ఎఫ్​డీపై అధిక వడ్డీ! - యూకో బ్యాంక్ టీకా ఆఫర్​

ప్రజల్లో కరోనా వ్యాక్సిన్​పై అవగాహన పెంచడం, టీకా తీసుకునేలా వారిని ప్రోత్సహించడం కోసం పలు బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. టీకా తీసుకున్న వారికి డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు చెల్లించనున్నట్లు తెలిపాయి. ఆఫర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

covid vaccine offers by Govt Banks
టీకా తీసుకుంటే ఎఫ్​డీపై వడ్డీ పెంపు

By

Published : Jun 8, 2021, 2:08 PM IST

Updated : Jun 9, 2021, 2:17 PM IST

కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సరికొత్త ఆఫర్​ను ప్రకటించాయి. వాక్సిన్ తీసుకున్న వారికి ఫిక్స్​డ్​ డిపాజిట్లపై సాధారణం కన్నా అధిక వడ్డీ రేటు చెల్లించనున్నట్లు వెల్లడించాయి. అయితే ఇది పరిమిత కాల ఆఫర్​ అని స్పష్టం చేశాయి.

ఆఫర్లు ఇలా..

కనీసం ఒక డోస్ కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్న వారికి 999 రోజుల పరిమితి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్(ఎఫ్​డీ)​పై 0.30 శాతం వడ్డీ అధికంగా చెల్లించనున్నట్లు యూకో బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్​ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 'ఇమ్యూన్​ ఇండియా డిపాజిట్ స్కీమ్'​ను ప్రారంభించింది. దీని ద్వారా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వినియోగదారులకు ఎఫ్​డీపై 25 బేసిస్​ పాయింట్ల (0.25 శాతం) వడ్డీ రేటు అధికంగా చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త పథకం ద్వారా ఫిక్స్​డ్​ డిపాజిట్​ మెచ్యూరిటీని 1,111 రోజులుగా నిర్ణయించింది.

ఇదీ చదవండి:టాప్‌-'అప్పు' కోసం రుణ బదిలీ మంచిదేనా?

Last Updated : Jun 9, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details