తెలంగాణ

telangana

తొలి త్రైమాసికంలో అమెరికా జీడీపీలో భారీ క్షీణత

By

Published : Apr 29, 2020, 11:58 PM IST

దశాబ్దపు కాలంలో ఎన్నడూ లేనంతగా అమెరికా తొలి త్రైమాసికంలో జీడీపీ కేవలం 4.8శాతంగా నమోదైందని ప్రభుత్వ ముందస్తు అంచనాల్లో తేలింది. ఇందుకు కారణం కరోనా వైరస్​ కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని బ్యూరో ఆఫ్​ ఎకానమిక్​ అనాలిసిస్​ పేర్కొంది. అయితే రెండో త్రైమాసికంలో జీడీపీ మరింత దారుణంగా పతమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

COVID-19: US economy shrinks by 4.8 per cent in first quarter
అమెరికా తొలి త్రైమాసికం జీడీపీ 4.8శాతం

అమెరికాపై కరోనా వైరస్​ ప్రభావం భారీగా పడింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. వీటితో పాటు అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా.. తొలి త్రైమాసికంలో యూఎస్​ జీడిపీ కేవలం 4.8శాతంగా నమోదైందని ప్రభుత్వ ముందస్తు అంచనాల్లో వెల్లడైంది.

"కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన స్టే ఎట్​ హోం ఆదేశాల వల్ల తొలి త్రైమాసికం జీడీపీ తగ్గింది. అలాగే డిమాండ్​లో పెను మార్పులు వచ్చాయి. వాణిజ్యం, పాఠశాలలు మూతపడ్డాయి. వినియోగదారులు తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు."

-- బ్యూరో ఆఫ్​ ఎకానమిక్​ అనాలిసిస్​(బీఏఈ).

అమెరికాలో రెండో త్రైమాసికం మరింత దారుణంగా మారనుందని హెచ్చరించింది బీఏఈ. జీడీపీ మైనస్​ 15 నుంచి మైనస్​ 20శాతం మధ్యలో నమోదయ్యే అవకాశముందని శ్వేతసౌధం సీనియర్​ అర్థిక సలహాదారు కెవిన్​ హాస్సెట్​ అభిప్రాయపడ్డారు.

అయితే నాలుగో త్రైమాసికానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details