కరోనా రెండో దశతో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమని షేర్ మార్కెట్ బిగ్ బుల్‌గా పేరుగాంచిన ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అభిప్రాయపడ్డారు. మహమ్మారి రెండో దఫా విజృంభిస్తున్నప్పటికీ.. రెండంకెల వృద్ధి రేటు నమోదు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లు భారీగా దూసుకెళ్లే క్రమంలో ఉన్నాయని తెలిపారు.
మార్కెట్ల భారీ పతనానికి అవకాశాలు..
మార్కెట్ సూచీలు ప్రస్తుతం దిద్దుబాటుకు గురవుతుండడంపై స్పందిస్తూ.. ఇది ఎంత కాలం కొనసాగుతుందనేది అంచనా వేయలేమన్నారు. అలాగే మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయాని కూడా చెప్పలేమన్నారు. కరోనా కేసులు 2.50 లక్షలు దాటినప్పటికీ.. మార్కెట్లు మరీ భారీగా పతనమవుతున్న సందర్భాలు లేవని తెలిపారు. కరోనా మరీ అదుపులో లేకుండా పోయి రోజుకి ఆరు లక్షలకు పైగా కేసులు నమోదైతే గానీ మార్కెట్లు పడే సూచనలు కనిపించడం లేదన్నారు.