దేశ వృద్ధి రేటుపై ఈ ఏడాది ఆరంభంలో భారీ అంచనాలు విడుదల చేసిన రేటింగ్ ఏజెన్సీలు ఇప్పుడు వాటికి కోతలు విధిస్తున్నాయి. 2021-22లో భారత వృద్ధి రేటు 9.5 శాతానికి పరిమితం అవ్వచ్చని ఫిచ్ రేటింగ్స్ తాజాగా లెక్కగట్టింది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతుండటం ఇందుకు కారణంగా పేర్కొంది ఫిచ్.
మార్చిలో ఫిచ్ అంచనా 12.8 శాతంగా ఉండటం గమనార్హం.