ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 7 రంగాల్లో సంస్కరణలు ప్రకటించారు.
సంస్కరణల పథం: కరోనా ప్యాకేజ్ 5.0 హైలైట్స్ - stimulus package
Finance Minister Nirmala Sitharaman on Sunday will announce the 5th tranche of economic package at 11 AM.
12:42 May 17
12:31 May 17
ఆర్థిక ప్యాకేజీ మొత్తం కేటాయింపు వివరాలు
- ఎం.ఎస్.ఎం.ఈలకు రూ.3 లక్షల కోట్లు
- రుణ ఒత్తిడిలో ఉన్న ఎం.ఎస్.ఎం.ఈలకు రూ.20 వేల కోట్లు
- ఎం.ఎస్.ఎం.ఈలకు ఫండ్ ఆఫ్ ఫండ్ కోసం రూ.50 వేల కోట్లు
- ఈపీఎఫ్ మద్దతు చర్యలకు రూ.2800 కోట్లు
- ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు రూ.30 వేల కోట్లు
- ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలకు పాక్షిక రుణ హమీల కింద రూ.45 వేల కోట్లు
- విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్ధికసాయం విలువ రూ.90 వేల కోట్లు
- టీడీఎస్, టీసీఎస్ తగ్గింపు నిర్ణయం విలువ రూ.50 వేల కోట్లు
12:28 May 17
3 నుంచి 3.5 శాతం వరకు తీసుకునే అప్పులకు ఎలాంటి షరతులు లేవు. ఆ పైన తీసుకునే అప్పులు సంస్కరణలకు లోబడిన విధానాలు అమలు చేయాలి. 3.5 నుంచి 4.5 శాతం వరకు తీసుకునే అప్పులు నాలుగు దశల్లో విడుదల. 4.5 నుంచి 5శాతం వరకు కూడా ఉపయోగించుకోవాలంటే నిర్దేశించిన నాలుగు లక్ష్యాల్లో మూడింటిని తప్పనిసరిగా చేరుకోవాలి.
- నిర్మలా సీతారామన్
12:26 May 17
రాష్ట్రాలకు అనుమతించిన దానిలో ఇప్పటికి కేవలం 14 శాతాన్నే ఉపయోగించుకున్నారు. రాష్ట్రాలకు అనుమతించిన అప్పుల్లో 86% ఇంకా ఉపయోగించుకోలేదు. రాష్ట్రాల జీఎస్‌డీపీ మీద అప్పులు తీసుకునే వెసులుబాటును 3 నుంచి 5%కి పెంచుతున్నాం. పెంచిన పరిమితి వల్ల రాష్ట్రాలు 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకోవచ్చు. ఒక త్రైమాసికంలో రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి 32 రోజుల నుంచి 50 రోజులకు పెంపు. అప్పులు తీసుకునే పరిమితిని పెంచమని పలు రాష్ట్రాలు విజప్తి చేశాయి. వాటి వినతుల మేరకు జీఎస్‌డీపీలో 5 శాతం వరకు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు. ఇదిచాలా పెద్దమొత్తమే అయినా... కరోనా సంకటంలో తప్పక అనుమతి ఇస్తున్నాం.
- నిర్మలా సీతారామన్
12:19 May 17
రెవిన్యూలోటు భర్తీ కోసం రూ. 12,390కోట్లను ఏప్రిల్, మే నెలల్లో విడుదల చేశాం. ఎస్డీఆర్‌ఎఫ్ అడ్వాన్స్‌ల కింద రూ. 11.092కోట్లను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేశాం. ఎస్డీఆర్‌ఎఫ్ అడ్వాన్స్‌ల కింద రూ. 11.092కోట్లను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేశాం. కరోనాపై పోరులోభాగంగా రాష్ట్రాలకు రూ.4113కోట్లను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. వేస్ ఆండ్ మీన్స్ పరిమితిని 60% మేర పెంచింది ఆర్బీఐ. రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ కాల పరిమితిని 14నుంచి 21రోజులకు పెంచింది ఆర్బీఐ.
- నిర్మలా సీతారామన్
12:18 May 17
నిర్వహణ వ్యయాల వృథాను తగ్గించటం కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు. ప్రభుత్వరంగం సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి త్వరలో పూర్తి విధివిధానాలు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో భారీగా కోతపడిన విషయం కేంద్రం గుర్తించింది. ఈ కష్టకాలంలో వారికి నిరంతరం సాయం అందిస్తునే వస్తున్నాం. పన్నుల వాటాలో భాగంగా రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు పంపిస్తునే ఉన్నాం. ఏప్రిల్‌లో కేంద్ర నుంచి పన్నుల వాటాగా రూ. 46,038కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశాం.
-నిర్మలా సీతారామన్
12:10 May 17
ప్రతి రంగంలోనూ ఒక ప్రభుత్వరంగ సంస్థ తప్పకుండా ఉండాలి. అదే సమయంలో ప్రతిరంగంలో ప్రైవేటుపెట్టుబడులకు కూడా అనుమతి. నోటిఫై చేసిన రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు తప్పకుండా ఉంటాయి. నోటిఫై చేసిన రంగాల్లో కనీస ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఉంటుంది
మిగిలిన అన్ని రంగాల్లోని ప్రభుత్వ రంగం సంస్థలు ప్రైవేటీకరణకు నిర్ణయం.ఇప్పటికే ఒకటే రంగంలో ఒకటికి మించి ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు హేతుబద్దీకరణ. ఇప్పటికే ఒకటే రంగంలో ఒకటికి మించి ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు హేతుబద్దీకరణ. వాటి సంఖ్య తగ్గించటం, ఒకదానిలో మిగిలినవాటి విలీనం ఇలా అనేక నిర్ణయాలు ఉండొచ్చు. నోటిఫైడ్ వ్యూహాత్మర రంగాల్లో కూడా నాలుగుకు మించి ప్రభుత్వరంగ సంస్థలు ఉండవు.
- నిర్మలా సీతారామన్
11:56 May 17
"కరోనా-లాక్‌డౌన్ కారణంగా దేశంలో వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కరోనా కారణంగా కలిగిన నష్టాలకు దివాళ స్మృతి నుంచి మినహాయింపు.ఇలాంటి నష్టాలకు సంబంధించి ఏడాది వరకు దివాళ ప్రక్రియలు చేపట్టం. ఎం.ఎస్.ఎం.ఈ.లకు సంబంధించి ప్రత్యేక దివాళ విధివిధానాలు. కంపెనీల ఒప్పందాల కాలపరిమితి పొడగించేందుకు కొన్ని వెసులుబాట్లు. వాటికి సంబంధించి అభియోగాలపై చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా కంపెనీల చట్ట సవరణ
అనుమతించిన విదేశాల్లో పబ్లిక్ కంపెనీలు నేరుగా సెక్యూరిటీలను లిస్ట్ చేసుకోవచ్చు".- నిర్మలా సీతారామన్
11:51 May 17
చూపు, వినికిడి సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేక ఈ-బోధన సామాగ్రి. దేశవ్యాప్తంగా మే 30 నుంచి 100విశ్వవిద్యాలయాలకు ఆన్‌లైన్ కోర్సులకు అనుమతి. రేడియో, కమ్యూనిటీ రేడియా, పాడ్‌కాస్ట్‌ల సేవలు విస్తృతంగా వినియోగం.
- నిర్మలా సీతారామన్
11:48 May 17
పీఎం కేర్స్ నిధికి ఇచ్చే విరాళాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కిందకు చేర్చాం. ఉపాధిహామీ పథకానికి అదనంగా రూ. 40వేల కోట్ల కేటాయింపులు
మొత్తం మీద 300కోట్ల పనిదినాలు కల్పించటానికి ఈ కేటాయింపులతో ఉపయోగం. జాతీయస్థాయిలో ఆన్‌లైన్ బోధన కోసం ఈ-విద్య
ఇకపై ప్రతి తరగతికి ఒక ప్రత్యేక టీవీ ఛానల్. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ప్రత్యేక ఛానల్.- నిర్మలా సీతారామన్
11:38 May 17
"టెస్టింగ్ ల్యాబ్‌లు, పరీక్ష కిట్‌ల కోసం రూ. 550కోట్లు. దేశీయంగానే పీపీఈ కిట్‌ల తయారీలో ముందంజ వేశాం. ఇవాళ దేశంలో 300కుపైగా పీపీఈ కిట్ తయారీ పరిశ్రమలు వచ్చాయి."
- నిర్మలా సీతారామన్
11:35 May 17
"రూ.15 వేల కోట్ల ప్యాకేజీలో ఇప్పటికే రాష్ట్రాలకు రూ. 4113 కోట్లు విడుదల చేశాం. అత్యవసరమైన సామాగ్రి కోసం రూ. 3750 కోట్ల రూపాయలు.
స్వయంప్రభలో ఇప్పటికే మూడు ఛానళ్లు సేవలు అందిస్తున్నాయి. వాటికి మరో 12 ఛానళ్లను జత చేయాలని నిర్ణయం తీసుకున్నాం."- నిర్మలా సీతారామన్
11:24 May 17
ఈ రోజు ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా ఏడు అంశాలపై ప్రకటన
- ఉపాధి హామీ పథకం
- ఆరోగ్య రంగం- పట్టణ, గ్రామీణం
- విద్య-కొవిడ్
- వ్యాపారం-కొవిడ్
- డీక్రిమనలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- సంబంధిత అంశాలు
- పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్- సంబంధిత అంశాలు
- రాష్ట్ర ప్రభుత్వాలు-వనరులు
11:22 May 17
"దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసజీవులక కోసం ప్రత్యేకరైళ్లు నడుపుతున్నాం. ఈ రైళ్లు నడపడానికి అయ్యే ఖర్చులో 85%కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ప్రయాణ సమయంలో రైలులో వలస కార్మికులకు ఆహారం కూడా అందిస్తుంది. ప్రాణాలు కాపాడుకోవటమే మొదటి ప్రాధాన్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత జీవితాలను సవ్యంగా నడవడం కూడా చాలా ముఖ్యం. లాక్‌డౌన్ తర్వాత దశలో పరిశ్రమలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటాయి. ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం."
- నిర్మలా సీతారామన్
11:19 May 17
"ప్రధానమంత్రి కిసాన్ యోజన, సంక్షేమ పింఛన్ల రూపంలో వేల కోట్ల రూపాయల బదిలీ చేశాం. లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చే విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపు చేరుకున్నాం. 20 కోట్ల జన్‌ధన్‌ఖాతాల్లోకి గరీభ్ కల్యాణ్ యోజన కింద నగదు బదిలీ చేశాం. డీబీబీ విధానం వల్ల లబ్దిదారుల ఖాతాల్లోకే నేరుగా నిధుల బదిలీ సాధ్యమైంది. 12 లక్షలమంది ఈపీఎఫ్‌లో చందాదారులు ఆన్‌లైన్ ఉపసంహరణలతో లబ్ది పొందారు. కరోనా మహమ్మారి కమ్మేసిన సంక్షోభంలో సాంకేతిత సంస్కరణల సాయంతోనే ఎంతో మేలు జరిగింది."
- నిర్మలా సీతారామన్
11:16 May 17
"దేశంలో ప్రతిమూలకు ఆహారధాన్యాల సరఫరా చాలా కీలకమైన సవాల్. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. వలస జీవుల ఆకలి తీర్చటంలో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ. సాంకేతిక పరమైన సంస్కరణలు జరగపోయి ఉంటే అది సాధమయ్యేదే కాదు."
- నిర్మలా సీతారామన్
11:12 May 17
"సంక్షోభం వచ్చింది వాస్తవమే.. ఇందులో అవకాశాలు వెతుక్కోవాలి. ప్రధాని నిరంతరం సంక్షోభంలో అవకాశాలు వెత్తుక్కోమని చెబుతున్నారు. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కొని స్వయం సమృద్ధం కావాలన్నదే లక్ష్యం. గత రెండ్రోజుల్లో ప్రకటించిన అంశాల్లో అనేక సంస్కరణలు ప్రకటించాం. భూమి, శ్రమ, చట్టాలు ఈ మూడింట్లోనూ నూతన సంస్కరణలకు శ్రీకారం."
- నిర్మలా సీతారామన్
11:10 May 17
- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో విడత ప్యాకేజీ ప్రకటన
- పలు రంగాలకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి ప్యాకేజీ వివరాల వెల్లడి
10:49 May 17
కరోనా ప్యాకేజీ 5.0: మిగిలిన రంగాలపై నిర్మల ప్రకటన
భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు చివరి రౌండ్ ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే పలు ముఖ్య రంగాల్లో ఉద్దీపనలు, సంస్కరణలు ప్రకటించిన నిర్మలా సీతారామన్.. ఈ రోజు మిగిలిన రంగాల గురించి ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తారు.