తెలంగాణ

telangana

ETV Bharat / business

2021-22 బడ్జెట్​ అంచనా రూ.34.83 లక్షల కోట్లు

2021-22 వార్షిక బడ్జెట్​ అంచనా మొత్తం రూ.34.83 లక్షల కోట్లుగా ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ ఏడాదికి ద్రవ్యలోటు 9.5 శాతంగా అంచనా వేయగా.. వచ్చే ఏడాదికి 6.8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

BUDGET 2021
2021-22 బడ్జెట్​ అంచనా రూ.34.83 లక్షల కోట్లు

By

Published : Feb 1, 2021, 1:25 PM IST

కేంద్ర వార్షిక బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. కరోనా వైరస్​ ఉపశమన చర్యలు కొనసాగుతున్న క్రమంలో 2021-22 ఆర్థిక ఏడాదికి బడ్జెట్​ అంచనా మొత్తం రూ. 34.83 లక్షల కోట్లుగా తెలిపారు. గత ఏడాది రూ.30.42 లక్షల కోట్లుగా ఉందన్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిందని పేర్కొన్నారు నిర్మల.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం. వచ్చే ఏడాదికి ద్రవ్య లోటు 6.8 శాతానికి పరిమితం చేయటమే లక్ష్యం. ద్రవ్యలోటును 2025-26 నాటికి 4.5 శాతంలోపు పరిమితం చేయాలని లక్ష్యం. జీడీపీ క్షీణత మైనస్​ 7.7 శాతంగా అంచనా వేశారు.

ద్రవ్యలోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు. రెండు నెలల్లో రూ. 80 వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయం.

2021-22 ఏడాదిలో కొవిడ్​-19 టీకా పంపిణీకి రూ. 35 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు నిర్మల. అవసమైతే మరిన్ని నిధులు సమకూర్చుతామన్నారు. ఆరోగ్య, సంక్షేమ రంగానికి.. 2020-21 (రూ.94,452 కోట్లు) తో పోలీస్తే.. 2021-22 ఏడాదికి రూ. 2.23 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 137 శాతం పెంచామన్నారు.

ABOUT THE AUTHOR

...view details